Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్‌లో నాలాలో పడిన ఏడేళ్ళ బాలుడు..

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (17:24 IST)
తెలంగాణాలోని సికింద్రాబాద్ నగరంలో విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. స్థానిక బోయినపల్లికు చెందిన ఏడేళ్ళ ఆనంద సాయి అనే బాలుడు చిన్నతోకట్ట నాలాలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికులను విషాదంలో ముంచెత్తింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్ బోయినపల్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నాలాలో పడిపోయాడు. ఆ సమయంలో మురుగునీటి ప్రవాహం అధికంగా ఉండటంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆనంద్‌సాయి గల్లంతయ్యాడు. 
 
దీనిపై సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు గాలించి.. ఆనంద్‌సాయి మృతదేహాన్ని బయటికి తీశారు. బాలుడి మృతిపట్ల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే నాలాకు రక్షణ గోడ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments