Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లిన పారిశుద్ద్య కార్మికుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (20:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో హృదయ విదారక సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో క్షయ వ్యాధితో చనిపోయిన ఆటో కార్మికుడి పాడెను మోసేందుకు ఇరుగుపొరుగువారు ఒక్కరంటే ఒక్కరు రాలేదు. దీంతో కొందరు ముస్లిం యువకులే పాడెమోసి, అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఈ ఘటన మరువకముందే తాజాగా మరో హృదయ విదారక సంఘటన ఒకటి జరిగింది. ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లడం చూస్తే హృదయం చలించుకునిపోతుంది. ఇది కామారెడ్డి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిర్మల్‌కు సమీపంలోని ఇడ్గవ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈయన కామారెడ్డిలో నివసిస్తూ స్థానిక రైల్వే స్టేషన్‌లో హమాలీగా పని చేస్తున్నాడు. అయితే, ఈయన తన ఇంట్లోనే అనుమానాస్పదంగా చనిపోయాడు. 
 
ఈ విషయం తెలసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద కేసుగా నమోదు చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకురాలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికుడు మృతదేహాన్ని తరలించేందుకు వాహనాన్ని సమకూర్చారన్ని ప్రాధేయపడగా, ఏ ఒక్కరూ స్పందించలేదు. 
 
అలాగే, సాయం చేసేందుకు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకురాలేదు. దీంతో ఇకచేసేదేం లేక... అతని సైకిల్‌పై శవాన్ని శ్మశానవాటికకు తరలించారు. ఈ దృశ్యాన్ని ఎవరో మొబైల్‌లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఈ దృశ్యాలను చూస్తే ప్రతి ఒక్కరి గుండె తరుక్కునిపోతుంది. 
 
హిందూ పాడె మోసిన ముస్లింలు 
హైదరాబాద్ నగరంలో ముస్లింలు మానవత్వాన్ని ప్రదర్శించారు. క్షయ వ్యాధితో చనిపోయిన ఓ ఆటో డ్రైవర్‌కు అంత్యక్రియలు చేశారు. ముఖ్యంగా, మృతి చెందిన ఆటో డ్రైవర్‌ పాడి మోసేందుకు ఇరుపొరుగువారు రాకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగిన ముస్లింలు పాడె మోసి మానవత్వాన్ని ప్రదర్శించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, ఖైరతాబాద్‌కు చెందిన వేణు ముదిరాజ్ ఓ ఆటో డ్రైవర్ (50). గత కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. దీంతో ఆయనకు వ్యాధి ముదరడంతో వేణు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 16న మరణించాడు. అతడి భార్య ఎప్పుడో చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
అయితే, ఇరుగుపొరుగు వారు మాత్రం వేణు కరోనాతో చనిపోయాడని భావించి అతడి మృతదేహాన్ని కాలనీకి తీసుకువచ్చేందుకు అభ్యంతరం చెప్పారు. సాయం చేసేందుకు నిరాకరించారు. వేణు పిల్లల వద్ద అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కూడా లేదు. 
 
ఈ విషయం తెలిసిన సాదిక్ బిన్ సలామ్ అనే ముస్లిం సామాజిక కార్యకర్త తన నలుగురు మిత్రులైన మాజిద్, ముక్తాదిర్, అహ్మద్, ఖాసిమ్ లకు సమాచారం అందించాడు. వెంటనే వారందరూ అక్కడికి చేరుకుని ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. హిందూ శ్మశానవాటిక వరకు పాడె మోసి వేణు అంత్యక్రియలు జరిపించారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments