అట్టహాసంగా మేడారం జాతర.. గద్దెలపై కొలువుదీరనున్న సారలమ్మ

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (10:14 IST)
మేడారం జాతర బుధవారం నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ జాతర ఈ నెల19 వరకు జరుగనున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాల కోసం సర్వం సిద్ధం అయ్యింది. సమ్మక్క కూతురైన సారలమ్మ .. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గద్దెలపై కొలువుదీరనుంది. 
 
రేపు కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు వేడుకగా తీసుకువచ్చి ప్రతిష్టించనున్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున జనం మొక్కులను తీర్చుకోనున్నారు. ఇక శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.
 
మేడారం జాతరకు జిల్లా కలెక్టర్ ఆదిత్య కృష్ణ అధికారిక సెలవులు ప్రకటించారు. సమ్మక్క-సారక్క జాతర జరిగే ములుగు జిల్లా వరకు నాలుగు రోజులపాటు అధికారికంగా సెలవులు ప్రకటించారు. స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవులు ఇచ్చారు. 
 
అలాగే ఈ ఏడాది మేడారం జాతరకు ప్రతిసారి కంటే జనం ఎక్కువగా రావడంలో కొత్త రికార్డులను క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు హుండీ లెక్కింపుల్లో కూడా కొత్త రికార్డులు నమోదు చేసింది. 
 
ఇప్పటికే హుండీ ఆదాయం పాత రికార్డులను బ్రేక్ చేసింది. 2018 జాతరలో 10 కోట్ల 17 లక్షల 50 వేల 363 రూపాయలు హుండీ ఆదాయం రాగా.. ఈసారి ఇప్పటికే ఆ ఆదాయం కంటే ఎక్కువ వచ్చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments