Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్‌రూంలో బంగారు బిస్కెట్లు .. స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (17:17 IST)
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ. 1.11 కోట్లు విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 
 
షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న షేక్‌ అబ్దుల్‌ సాజిద్‌ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగారం తరలిస్తున్నాడనే సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో దిగిన సాజిద్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే విషయాన్ని గ్రహించి తాను తీసుకొచ్చిన బంగారాన్ని విమానాశ్రయంలోని మరుగుదొడ్డిలో పడేశాడు. 
 
కాగా సాజిద్‌ను తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులకు అతని వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. దీంతో అదుపులోకి తీసుకొని విచారించగా శౌచాలయంలో పడేసిన విషయాన్ని అధికారులకు చెప్పాడు. దీంతో బాత్‌రూంలో ఉన్న 2.99 కిలోల బరువున్న 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments