అప్పటిదాకా తోటి విద్యార్థులతో కలిసి మెలసి ఉన్న స్నేహితురాలు పాఠశాలకు టైం అవుతుంది అని చెప్పి తొందరగా రెడి కావాలి అంటూ బాత్‌రూమ్ లోకి వెళ్లింది. ఐతే ఆ తర్వాత ఆమె ఎంతకూ బయటకు రాలేదు. దాంతో తలుపులు పగులగెట్టి చూసేసరికి స్ప్రుహ లేకుండా కింద పడి ఉన్న స్నేహితురాలిను చూసిన తోటి విద్యార్థులు వెంటనే ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు.
వెంటనే జనగామ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందింది విద్యార్థిని. ప్రిన్సిపాల్ విద్యార్థిని బంధువులకు సమాచారం అందించారు.విద్యార్థిని మృతికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణం అంటూ వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు.
భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో బ్యాక్ టూ బ్యాక్ క్రిస్టియన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన వసతి గృహంలో నల్గొండ జిల్లా, తిరుమలగిరి మండలం మొఖ్య తండాకు చెందిన కేతవత్ బిందు (14 సంవత్సరాలు) ఆలేరు జేఎంజె పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం త్వరగా పాఠశాలకు వెళ్ళాలి అని బాత్రూం లోకి వెళ్లి రాకపోవడంతో తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తమ బిడ్డ బిందు మృతికి వసతి గృహం యాజమాన్యం నిర్లక్ష్యం కారణం అని బంధువులు వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.