Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కేటీఆర్‌కు సంబంధం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీతో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విష‌యంపైనే తాను ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండానే సభను వాయిదా

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (15:30 IST)
తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీతో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విష‌యంపైనే తాను ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండానే సభను వాయిదా వేశారని ఆయ‌న ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీ ప్రాంగ‌ణంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌కు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు. 
 
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను అన్ని ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ‌లో డ్రగ్స్ విషయంపై తాను ఇప్ప‌టికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. 
 
తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీ విచారణ జరిపించాలన్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని, ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నా... దమ్ముంటే నాపై కేసు పెట్టండి అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. చిన్న పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments