Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి రాజీనామా? బీజేపీలో చేరుతారా?

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (15:06 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఏ. రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి రేవంత్ రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో ఆయన అంతకుముందు తనకున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. 
 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ భవిష్యత్‌ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశానన్నారు. పార్టీలో పదవి లేకపోయినా కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి చేస్తానని రేవంత్ స్పష్టంచేశారు. యువరాజు రాహుల్‌ స్ఫూర్తితో రాజీనామా చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ కమలం ప్రారంభించింది. ఇందులోభాగంగా పలువురు ఓ రాజ్యసభ సభ్యుడుతో పాటు.. పలువురు టీడీపీ సీనియర్ నేతలు పార్టీలో చేరారు. అలాగే, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నేతల నేతలపై బీజేపీ దృష్టిసారించింది. 
 
అలాగే, రేవంత్ రెడ్డితో కూడా బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇదే విషయంపై పలువురు నేతలు రేవంత్‌తో చర్చలు జరిపినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments