Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజ్వేల్‌ సభలో యముడి రూపంలో రేవంత్ రెడ్డి కటౌట్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (21:36 IST)
రేవంత్ రెడ్డి యముడు హోర్డింగ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి భారీ కటౌట్ పెట్టడంపై చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి ఛలో గజ్వేల్ సభ అలంకరణలో భాగంగా ఈ కటౌట్‌ను వుంచారు. రేవంత్ రెడ్డి గజ్వేల్ సభకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్‌లో జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో అన్నారు. 
 
వేలాది మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని.. కానీ కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. 
 
తెలంగాణలో 12 శాతం ఉన్న మాదిగలకు కేబినెట్‌లో స్థానం లేదని.. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తన కుమారుడినో, అల్లుడినో కేబినెట్ నుంచి తప్పించి ఆ స్థానంలో మాదిగలకు స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల, విద్యార్థులు, దళితుల కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అందరినీ మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
 
గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంతా గీతారెడ్డి హయాంలోనే జరిగిందని అన్నారు. విద్యార్థులకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకొస్తే.. కేసీఆర్ దాన్ని నీరుగార్చారని అన్నారు. గొర్రెలు, బర్రెలు తమ పిల్లలకు వద్దని.. తమ పిల్లలకు చదువులు కావాలని అన్నారు. ఆరోగ్యశ్రీని పటిష్టం చేసి పేదలందరికీ ఉచితంగా రూ. 5 లక్షల వరకు చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. అనేక ప్రభుత్వ పాఠశాలలను మూసేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments