sunita tati- philiprjohn etc
కొరియన్ నవల ఆధారంగా తీసిన `మిస్‌గ్రానీ` సినిమాను `ఓ బేబీ`గా సునీత తాటి తెలుగులో నిర్మించారు. సమంత నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. తాజాగా సునీత తాటి మరో ప్రయోగాన్ని చేస్తున్నారు. టైమెరి మురారి రచించిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ నవల ఆధారంగా తెలుగులో మరో ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రికోసం వెతికే క్రమంలో ఇండియా వచ్చే కొడుకు కథతో ఈ సినిమా రూపొందబోతోంది.
తన తల్లి, సవతి తండ్రితో కలిసి అమెరికాలో నివసించే నిఖిల్ అనే అబ్బాయి కథను ఈ నవల చెబుతుంది. అతని తల్లి, సుష్మా అకా సూసీ (అమెరికాలో) అనుకోని స్థితిలో చనిపోతుంది. అనంతరం తన నిజమైన తండ్రిని కనుగొనడానికి నిఖిల్ ఇండియాకు వెళ్లాలనే నిర్ణయంతో ఈ నవల మొదలవుతుంది- అతను ఇండియా వస్తాడు. తను అనుకున్నది సాధించాడా!లేదా! అనేది మిగిలిన కథ.
మంగళవారంనాడు ఈ చిత్రం గురించి నిర్మాత ప్రకటన విడుదల చేశారు. గురు ఫిలిం ప్రొడక్షన్స్‌పై రూపొందనున్న ఈ సినిమాకు రచన, దర్శకత్వం ఫిలిప్రోజోన్ వహిస్తున్నారు. ఇందులో తల్లి పాత్ర, కొడుకు పాత్ర ఎవరనేది త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. దీనికి సహ రచన నిమ్మిహరసాగమ.