Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్‌కి రావాల్సిందే.. రాహుల్ గాంధీ కాదు.. ఇవాంకాను పిలుస్తాడేమో!

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:12 IST)
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి విసిరిన వైట్‌ ఛాలెంజ్‌‌ను స్వీకరించకుండా.. మంత్రి కేటీఆర్ పారిపోయాడని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డీ ఛాలెంజ్‌లో ముందుకు వచ్చారని.. కానీ కేటీఆర్‌ మాత్రం రాలేదన్నారు. విశ్వనియత నిరూపించుకోవాలి అంటే. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కి రావాల్సిందేనని స్పష్టం చేశారు షబ్బీర్‌ అలీ.
 
14 యేండ్ల పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని అకున్ సబర్వాల్ నివేదిక చెప్పిందని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా తారలు డ్రగ్స్ విషయం లో క్లియర్ ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు విచారణలో వుండగానే ఆకున్ సబర్వాల్ ను తప్పించారని.. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకు పబ్బులు వ్యాప్తి చెందాయని మండిపడ్డారు.
 
మరోవైపు రేవంత్‌ రెడ్డి, మంత్రి కేటీఆర్‌‌ల మధ్య సవాళ్ల పర్వం తగ్గేలా కనిపించడం లేదు. డ్రగ్స్‌ టెస్ట్‌‌పై మరోసారి కేటీఆర్‌‌పై ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి. డ్రగ్ టెస్టుకు రా అని నేను అడిగానా… నువ్వు అడిగావా..!?… కేటీఆర్‌ చెప్పిన దాన్నే తాను స్వీకరించానని తెలిపారు. మరో ఇద్దరికి సవాల్ విసిరానని… గన్ పార్క్‌కి అర గంట ముందే కేటీఆర్ వస్తారు అనుకున్నా… కానీ రాలేదన్నారు.
 
రాహుల్ గాంధీని రమ్మని చెప్పిన కేటీఆర్… ఇవాంక ట్రంప్‌ను కూడా రమ్మని అడుగుతారేమో? అంటూ చురకలు అంటించారు రేవంత్‌. రానా-రకుల్ ప్రీత్ సింగ్‌ను ఈడీ పిలిచింది.. వాళ్ళను అంటుంటే… కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని నిప్పులు చెరిగారు. 
 
కేసులు వేస్తం అని బెదిరిస్తున్నారని…. కేటీఆర్.. నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. కేటీఆర్.. ఎమ్మెల్యే కాకముందే.. తాను ఎమ్మెల్సీ అయ్యానని… రాజకీయంగా పోల్చితే కేటీఆర్‌… వెంట్రుకతో సమానమని వివాద్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ స్లీపింగ్ ప్రెసిడెంట్‌గా మారిపోయాడని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments