Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరసగా మూడు నెలలు రేషన్ బియ్యం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా రేషన్ కార్డు రద్దు

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (17:43 IST)
హైదరాబాద్: వరసగా మూడు నెలలు రేషన్ బియ్యం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా రేషన్ కార్డు రద్దు అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు గంగుల పై సమాధానం ఇచ్చారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కరోనా వల్లనే కొత్తకార్డులు ఆగిపోయాయని పేర్కొన్నారు.
 
ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డుల కోసం 9,41,641 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 3,59,974 మందికి ఆహార భద్రతా కార్డులు జారీ చేశామన్నారు. 92 వేల దరఖాస్తులను తిరస్కరించామని, 4,88,775 కార్డుల దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు.
 
గత మూడు సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 44 వేల 734 కార్డులు ఇచ్చామన్నారు. మరో 97 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments