Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తిరిగి చెల్లించని అడిగినందుకు వదినను అలా వేధించిన మరిది...

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:08 IST)
తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించమని కోరినందుకు వదినను ఆమె మరిది కాల్ ఉమెన్‌గా మార్చేశాడు. అలాగే, అన్నను కూడా వేధించాడు. రంగారెడ్డి జిల్లా మార్గుల మండలం, కలకొండలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన నగిళ్ళ యశ్వంత్‌ వరుసకు వదిన అయ్యే బంధువు వద్ద రూ.2 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించపోవడంతో ఆ విషయం ఆమె యశ్వంత్‌ అమ్మానాన్నల దృష్టికి తీసుకెళ్ళింది.  దాంతో తల్లిదండ్రులు అతడిపై కోపగించురున్నారు. 
 
దీన్ని మనసులో పెట్టుకున్న యువకుడు.. ఎలాగైనా వదిన, ఆమె భర్త పరువును బజారుకీడ్చాలని పథకం వేశాడు. వదిన మొబైల్‌ నంబర్‌ను ‘షేర్‌ చాట్‌’ అప్లికేషన్‌లో పోస్టు చేశాడు. ‘హాయ్‌..! ఐయామ్‌ ఆంటీ.. నాకు పెళ్లయింది ఒక కొడుకు ఉన్నాడు.. మా ఆయన వేస్ట్‌ ఫెలో. ఇంట్రెస్టు ఉన్నవారు కాల్‌ చేయండి’ అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు. 
 
దాంతో పోకిరీలు, ఆకతాయిలు రాత్రి, పగలు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు. దాంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడి ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments