Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ బారినపడిన కోలుకున్న చెర్రీ సతీమణి ఉపాసన

Webdunia
బుధవారం, 11 మే 2022 (14:58 IST)
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కరోనా వైరస్ బారినపడ్డారు. దీనికి చికిత్స తీసుకున్న తర్వాత ఆమె ప్రస్తుతం కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
చెన్నైలో ఉన్న తాతయ్య, అమ్మమ్మల వద్దకు వెళ్లేందుకు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందన్నారు. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల స్వల్ప కరోనా లక్షణాలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. 
 
దీంతో అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నానని, చికిత్స సమయంలో పారాసిటమల్, విటమిన్ మాత్రలు మాత్రమే వేసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారన్నారు. 
 
తనకు కరోనా సోకడంతో బాడీ పెయిన్స్, జట్టు ఊడిపోవడం, నీరసం వంటి సమస్యలు రావొచ్చని కొందరు చెప్పారని అయితే, తనకు అలాంటి ఏ సమస్యా రాలేదని చెప్పారు. 
 
కోవిడ్ పరీక్షలు చేయించుకోకపోతే తనకు కరోనా వైరస్ సోకిందన్న విషయమే తెలిసేది కాదన్నారు. ఈ సందర్భంగా తనకు చికిత్స చేసిన వైద్యులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర వీరప్రకాష్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments