Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (14:22 IST)
కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించారు. ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఆ రాష్ట్రంపై ఆయన ఫోకస్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది (2023)లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమయాత్తం చేయాలని ఆయన భావిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆయన సోమవారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ఈ సమావేశాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని గ్రూపులకు చెందిన నేతలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఇందులో పార్టీ బలోపేతం, ప్రజా ఉద్యమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా పార్టీ గ్రూపు రాజకీయాలపై చర్చించనున్నారు. 
 
ప్రధానంగా ఈ భేటీకి టీపీసీసీ చీఫ్‌ను వ్యతితేరికిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మరో సీనియర్ నేత వి.హనుమంతరావులను ఆహ్వానించడంతో ఈ భేటీ వాడివేడిగా జరిగే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత రాహుల్ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈ దఫా తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, కామారెడ్డి నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments