Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికలు : పొరపాటు చేసిన ఎమ్మెల్యే సీతక్క

Webdunia
సోమవారం, 18 జులై 2022 (15:07 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలోభాగంగా, సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాంటివారిలో ఎమ్మెల్యే సీతక్క ఒకరు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె పొరపాటు విపక్షాలు బలపరిచిన అభ్యర్థికికాకుండా, బీజేపీలోని ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టు ప్రచారం జరిగింది. 
 
దీనిపై సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను పెన్ను తీస్తుంటే పొరపాటున బ్యాలెట్ పేపర్ వైభాగం అంచు మీద గీత పడిందని, ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, వేరే బ్యాలెట్ పత్రం ఇవ్వాలని కోరగా అందుకు వారు నిరాకరించినట్టు చెప్పారు. 
 
అయితే, ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేశానని, అయితే, ఆ గీత వల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమవుతుందేమోననే అనుమానంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అయితే, తాను వేసిన ఓటు చెల్లుతుందో లేదో తనకు తెలియదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments