Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ భుజాన మరింత భారం.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా..?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (13:02 IST)
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందే దిశగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలాగే అత్యంత కీలకమైన బాధ్యతలను తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. పార్టీ గెలుపు అసాధ్యమనే నియోజక వర్గాలపై కేటీఆర్ దృష్టి సారించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇంకా సెటిలర్లు ప్రభావితం చేసే నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యత‌లు కేటీఆర్‌కు కట్టబెట్టారు. 
 
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌తో పాటు జిల్లాల్లోని కొన్ని ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యత‌లు కేటీఆర్‌కు అప్పగించిన‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే ఇబ్రహీంప‌ట్నం, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్యక‌ర్తలతో భేటీ అయ్యారు. ఇంకా అంత‌ర్గత విభేదాల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యత‌లు కూడా కేటీఆర్ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా గ్రేట‌ర్‌లోని 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే సెటిల‌ర్ల వ్యవ‌హారాన్ని కేటీఆర్‌కు అప్పగించిన‌ట్లు తెలుస్తోంది. సెటిలర్లుండే నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల‌ను గెలిపించి.. ఏపీ సీఎం చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు గులాబీదళం ప‌క్కా స్కెచ్ వేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments