Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్ రేప్ కేసు - ఇన్నోవా కారు డ్రైవర్‌ - తల్లిదండ్రులపై కేసు

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (10:28 IST)
దేశంలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ బాలిక అత్యాచారం కేసులో నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారు డ్రైవర్‌తో పాటు నిందితుల తల్లిదండ్రులపై హైదరాబాద్ నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. పోక్సో చట్ట ప్రకారం మైనర్ బాలికపై అత్యాచారం జరిగినపుడు ఆ విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వక పోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. 
 
ఈ నేపథ్యంలో సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించిన పోలీసులు ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
అలాగే, బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆ తర్వాత ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేసినట్టు గుర్తించిన పోలీసులు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. బాధితురాలిని తీసుకెళ్లిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కారును డ్రైవర్‌కు అప్పగించారు. 
 
అతడు దానిని మెయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఓ వ్యవసాయ క్షేత్రంలో నిలిపి వచ్చేశాడు. ఆ క్షేత్రం ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌దేనని విచారణలో నిందితులు పోలీసులకు తెలిపారు. కాగా, మైనర్ల విచారణ మంగళవారంతో ముగిసింది. కోర్టు అనుమతిస్తే కనుక ఒకటి రెండు రోజుల్లో టెస్ట్ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments