Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాడిసన్ బ్లూ హోటల్‌లో సోదాలు... పోలీసుల అదుపులో రాహుల్ సిప్లింగజ్

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (09:18 IST)
హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటళ్ళలో ఒకటైన రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని పుడ్డింగ్, మింక్ పబ్‌లపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో సహా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్ నిబంధనలను ఉల్లంఘించి, మూసివేసిన గంటల తర్వాత పబ్ నడపడంతో పోలీసులు పబ్‌పై దాడులు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి.
 
అదుపులోకి తీసుకున్న వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, తమను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారు. పోలీసులు వారి నుంచి సమాచారం సేకరించి విడుదల చేశారు. పార్టీలో ఎలాంటి రేవ్ పార్టీ జరగలేదని పోలీసులు నిర్థారించారు. పబ్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments