Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో హవాలా మనీ పట్టివేత - మంత్రి జగదీష్ కారులో తనిఖీలు

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (15:33 IST)
హైదరాబాద్ నగరంలో మరోమారు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు. గత నాలుగు రోజుల్లో జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా నగదును పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నగరంలో మరోమారు భారీగా హవాలా నగదు పట్టుబడింది. 
 
గాంధీనగర్ లో నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు, నగదుకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో రూ.3.5 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్రమంగా నగదు తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఇదిలావుంటే, తెలంగాణ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కారును పోలీసులు తనిఖీ చేశారు. ఈ ఘటన న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 
 
ఈ క్రమంలో మునుగోడు ప్రాంతంలో ప్రత్యేక పికెట్‌ను ఏర్పాటు చేసి వాహనాలను చెక్ చేస్తున్నారు. ఆ సమయంలో మునుగోడు వైపు వెళుతున్న మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి వాహ‌నాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని.. అందుకు తాను సహకరిస్తానని మంత్రి తనిఖీ బృందంతో చెప్పారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments