Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి దుస్తుల్లో జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వధువు.. వీడియో వైరల్

Advertiesment
bride gym workouts
నేటి సమాజంలో అనేక మంది వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఫిట్నెస్‌గా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకుంటూనే మరోవైపు జిమ్స్‌లలో వర్కౌట్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం లేకపోలేదు. ఓ యువతి పెళ్లి కుమార్తెలా ముస్తాబై జిమ్‌కు వచ్చింది. అక్కడ వివిధ రకాల వర్కౌట్స్ చేస్తుండగా వీడియో తీయించుకుంది. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఫిట్నెస్ కోసం వర్కౌట్స్ చేస్తున్న యువతి చీర, నగలు ధరించివుంది. జిమ్‌లకు వచ్చేవారు తమకు నచ్చిన దుస్తులు ధరించి వస్తుంటారు. కానీ, ఈ యువతి మాత్రం చీర కట్టి జిమ్‌చేస్తే వినడానికి, చూసేందుకు కాస్త వింతగానే కనిపిస్తుంది.. అనిపిస్తుంది కూడా. 
 
పెళ్లి కుమార్తెగా ముస్తాబైన ఈ యువతి.. వంటినిండా బంగారు ఆభరణాలు ధరించి, జిమ్‌లో డంబెల్స్ ఎత్తుతూ వ్యాయామం చేస్తోంది. ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఆమె అనేక రకాలైన వ్యాయామాలు చేస్తూ కనిపించారు.
 
వధువుకి సంబంధించి ప్రత్యేకమైన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోను పూనమ్ దత్తా అనే మహిళ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేవలం 27 సెకన్ల నిడివి వున్న ఈ వీడియో ఇప్పటివరకు 48 వేలకు వైపా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేస్తూ ట్వీట్ చేసారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో చిక్కుకున్న ఐకియా.. బాధితులకు సారీ చెప్పాలి