Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంమత్తులో బుల్లితెర నటుడి వీరంగం.. మహిళలపై దౌర్జన్యం!

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (12:19 IST)
'కోయిలమ్మ' సీరియల్‌లో హీరోగా నటించిన బుల్లితెర నటుడు సమీర్ అలియాస్ అమర్ హద్దులు దాటాడు. మద్యంమత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. పైగా, ఆ మహిళల ఇంటికి వెళ్లి వేధించడం గమనార్హం. 
 
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలన్నందుకు ఇలా రెచ్చిపోయాడు. సమీర్‌తో పాటు మరో నలుగురు దాడికి పాల్పడ్డారు. మణికొండలో జరిగిన ఈ ఘటనపై ఆ మహిళలిద్దరూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
 
కాగా, ఐదు లక్షల రూపాయిలు నగదు అప్పుగా తీసుకుని.. డబ్బులివ్వమని అడిగితే రౌడీయిజం చేస్తున్నాడంటూ ఫిర్యాదులో బాధితల మహిళలు పేర్కొన్నారు. సమీర్‌ నుంచి తమకు ప్రాణహానీ ఉందని మహిళలు పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళలిద్దరూ తమ దగ్గర సమీర్ డబ్బులు తీసుకున్నాడని చెబుతుండగా ఆయన మాత్రం మరోలా చెబుతున్నాడు.
 
అసలు ఈ వివాదానికి గల కారణాలను పరిశీలిస్తే, మణికొండలో శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీ అనే ముగ్గురు మహిళలు కలిసి బోటిక్ వ్యాపారం నిర్వహించేవారు. కొన్ని కారణాలవల్ల స్వాతి ఆ వ్యాపారం నుంచి తప్పుకుంది. స్వాతికి రావాల్సిన కొన్ని వస్తువులు తిరిగి ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి సమీర్‌తో కలిసి స్వాతి.. శ్రీవిద్య ఇంటికి వెళ్లింది. 
 
శ్రీవిద్య ఇంట్లో మాటా మాట పెరిగి అది కాస్త గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో శ్రీవిద్య, లక్ష్మీపై దౌర్జన్యానికి దిగాడు. అంతేకాదు ఆయనతో పాటు ఉన్న మిత్రులు కూడా ఆ మహిళలపై దాడికి తెగబడేంత పనిచేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments