Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్‌కు తేరుకోలేని షాకిచ్చిన యూట్యూబ్

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (12:13 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు యూట్యూబ్ యాజమాన్యం తేరుకోలేని షాకిచ్చింది. ఆయన చానల్‌పై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 
 
హింసాత్మక ఆందోళనల దృష్ట్యా డొనాల్డ్ జె. ట్రంప్ చానల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు యూట్యూబ్ ప్రతినిధి ఐవీ చోయ్ తెలిపారు. తమ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని, ఏవైనా కొత్త పరిణామాల కోసం నిశితంగా పర్యవేక్షిస్తున్నాయన్నారు. 
 
అదేవిధంగా ట్రంప్ సలహాదారు రూడీ గియులియానీ చానల్‌పైనా ఆంక్షలు విధించింది. తన చానల్ నుంచి డబ్బు సంపాదించగల సామర్థ్యాన్ని యూట్యూబ్ పరిమితం చేసింది. ఈ నెల 6న యూఎస్ కేపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్ల తర్వాత ట్రంప్ చానల్‌ను యూట్యూబ్ నిలిపివేసింది. 
 
తాజాగా, ఇప్పుడా నిషేధాన్ని మరింత పొడిగించింది. కాగా, తమ నిర్ణయంపై గియులియానీ 30 రోజుల్లో కోర్టులో సవాలు చేసుకోవచ్చని యూట్యూబ్ ప్రతినిధి తెలిపారు. ఇటీవల అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులకు దాడికి దిగిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments