Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ నేత మధుయాష్కీ నివాసంలో అర్థరాత్రి సోదాలు

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (11:59 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ నివాసంలో మంగళవారం అర్థరాత్రి పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌లు సంయుక్తంగా సోదాలు చేశారు. ఈ సోదాలు కలకలం సృష్టించాయి. 
 
ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం భారత రాష్ట్ర సమితి నేతలకు పట్టుకుందని, అందువల్లే కాంగ్రెస్ నేతలను లక్ష్యాంగా చేసుకుని ఐటీ, ఈడీ, పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌ బృందాలతో సోదాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
 
హైదరాబాద్ హయత్ నగర్ వినాయక నగర్‌లోని ఆయన తాత్కాలిక నివాసంలో గత అర్థరాత్రి ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ అనుచరులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తనిఖీల పేరుతో మధుయాష్కీ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ వారు ఆరోపించారు. 
 
బీఆర్ఎస్ నేతల ఒత్తిడితోనే పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాగా, ఈ సోదాలపై పోలీసులు కూడా స్పందిచారు. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వచేసి, డబ్బు పంపిణీ చేస్తున్నట్టు ఫిర్యాదలు రావడం వల్లే తనిఖీలు నిర్వహించినట్టు వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments