Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ లాడ్జి అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:20 IST)
సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందడం బాధిస్తుందన్నారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. 
 
కాగా, సికింద్రాబాద్‌లోని ఓ భవనం సెల్లార్‌లోని ఎలెక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈ-బైకులు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. లాడ్జిలోని మొదటి, రెండో ఫ్లోర్లలో ఉన్న వారు ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలుస్తోంది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పై నుంచి కిందకు దూకిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
 
ఈ ప్రమాద వార్త తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో పలువురు చనిపోవడం బాధను కలిగిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. 
 
మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చనిపోయిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. గాయపడిన వారికి రూ.50 వేలు చెల్లిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments