Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాస్‌పోర్టు ఫోటోలు తీసుకుంటే టమోటాలు ఉచితం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (08:33 IST)
దేశవ్యాప్తంగా టమోటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవైపు పంట దిగుబడి తగ్గిపోవడంతో మరోవైపు భారీ వర్షాల కారణంగా టమోటాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో టమోటా లేకుండానే కూరలు వుండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఓ ఫోటోగ్రాఫర్ వినూత్నంగా ఆలోచన చేశాడు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం, కలెక్టరేట్‌ తరలింపుతో నానాటికీ పడిపోతున్న గిరాకీ కాస్తయినా పెరుగుతుందని ఆయన భావించాడు. అంతే.. పాస్‌పోర్టు ఫోటో తీయించుకుంటే టమోటాలు ఉచితం అంటు ఓ బోర్డు పెట్టేశాడు. ఇదెక్కడో ఓ సారి చూద్దాం. 
 
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో పట్టణానికి చెందిన ఆనంద్‌ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. గతంలో స్థానికంగా కలెక్టరేట్‌ ఉన్నప్పుడు వ్యాపారం బాగానే నడిచేది. జిల్లా కలెక్టరేట్‌ పాల్వంచ మారడంతో గిరాకీ తగ్గింది. దీంతో తన వద్ద రూ.100 వెచ్చించి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు (8) తీసుకున్న వారికి పావు కిలో టమాటా ఉచితం అంటూ ప్రకటించి పట్టణ వాసుల దృష్టిని ఆకట్టున్నారు. 
 
అంతటితో సరిపెట్టుకోకుండా.. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడాన్ని పురవాసులు ఆసక్తిగా చూస్తున్నారు. వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 32 మంది వినియోగదారులు వచ్చారు. రూ.100 వెచ్చించి ఫొటోలు తీసుకున్న వారికి రూ.40 విలువైన పావు కిలో టమాటాలు అందజేసినట్లు ఆనంద్‌ మీడియాకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments