Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమంతం చేస్తామంటూ అబార్షన్.. భద్రాద్రిలో దారుణం

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (17:32 IST)
సీమంతం చేస్తామంటూ కన్నకూతురిని ఇంటికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు ఆమెకు అబార్షన్ చేయించిన దారుణ ఉదంతం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

కూతురు గర్భవతి అయిందని తెలిసి ఆనందాన్ని నటించిన ఆ తల్లిదండ్రులు ఆమెకు సీమంతం చేస్తామంటూ తమ ఊరికి తీసుకొచ్చారు. డాక్టర్ చెకప్ పేరిట ఆసుపత్రిలో చేర్పించి అబార్షన్ చేయించిన ఆ తల్లిదండ్రులు దారుణ ఉదంతమిది...
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ దారుణం జరిగింది. సీమంతం చేస్తామని తీసుకువచ్చి అల్లుడికి తెలియకుండా కూతురుకి అబార్షన్ చేయించారు అమ్మాయి తల్లితండ్రులు. అమ్మాయిది పాల్వంచ కాగా.. అబ్బాయిది రామవరం. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట హైదరాబాద్‌లో వుంటోంది.

తమ కూతురు కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా, తక్కువ కులం వారికి తల్లిగా మారబోతున్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు.

తమ ఆగ్రహాన్ని లోలోపలే ఉంచుకున్న తల్లిదండ్రులు పైకి మాత్రం ప్రేమ నటించారు. అల్లుడి వద్దకు వెళ్లి దాన్ని మర్చిపోయి చక్కగా ఉంటామంటూ నమ్మబలికారు. కూతురికి ఆర్భాటంగా సీమంతం చేస్తామంటూ తమ ఊరికి పంపించమని కోరారు.

అత్తమామల ప్రేమ నాటకాన్ని నమ్మి తన భార్యను వారి వెంట పంపించాడు అల్లుడు. ఆ తర్వాత హెల్త్ చెకప్ పేరిట ఆసుపత్రికి తీసుకు వెళ్లిన అమ్మాయి తల్లిదండ్రులు డాక్టర్‌తో అసత్యాలు చెప్పించి మరి ఆమెకు అబార్షన్ చేయించారు.

అల్లుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు అబార్షన్ చేసిన డాక్టర్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం