Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.... డివైడర్ ఢీకొని...

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (12:58 IST)
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ఓ కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ డివైడర్‌ను డీకొంది. ఈ ప్రమాదంలోకారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
 
అతివేగంతో కారు ప్రయాణించడంతో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి అదుపుతప్పి, హుస్సేన్ సాగర్ డివైడర్‌ను ఢీకొట్టి, రెయిలింగ్ మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారు హుస్సేన్ సాగర్‌లో పడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఈ ప్రమాదం జరిగిన వెంటనే అందులోని ప్రయాణికులు కారును వదిలేసి పారిపోయారు. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానును తనిఖీ చేయగా, కారులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక మద్యం మత్తులో కారు నడిపి, ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments