దయచేసి బయటకు రావొద్దు .. కిషన్ రెడ్డి :: ఓయూ పరీక్షలు వాయిదా

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (09:12 IST)
హైదరాబాద్ నగరంరో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. 
 
గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగరం మొత్తం నీట మునిగింది. ఎపుడు వరద నీరు ప్రాంతాలు సైతం ఇపుడు జలదిగ్బంధనంలో చిక్కుకునివున్నాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, వివిధ ప్రమాదాల్లో అనేక మంది మరణించటం బాధాకరమన్నారు. పిల్లలు, వృద్ధులు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని కోరారు. 
 
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కేంద్ర బృందాలను, పారామిలిటరీని పంపించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు.... అధికారుల సూచనలు పాటించాలన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 
 
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ ప్రొ. శ్రీరాం వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments