Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతును లారీతో తొక్కి చంపిన ఇసుక మాఫియా... ఎక్కడ?

Webdunia
గురువారం, 30 జులై 2020 (10:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది. ఈ అక్రమ రవాణాను పాలక వర్గానికి చెందిన నేతలే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో పోలీసులు, అధికారులు కూడా నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఇసుక మాఫియా ఓ రైతు ప్రాణాలు తీసింది. ఇసుకు అక్రమ రవాణాను అడ్డుకోవడమే ఆ రైతు చేసిన పాపం. అంతే.. అదే ఇసుక లారీతో రైతును తొక్కించి ఇసుకు మాఫియా చంపేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్‌ జిల్లా రాజాపూర్ మండలం, తిర్మలాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తన పొలం నుంచి ఇసుకను తవ్వితీసి అక్రమంగా రవాణా చేస్తుండగా రైతు గుర్రంకాడ పోచయ్య (38) అనే రైతు అడ్డుకున్నాడు. బోర్లు ఎండిపోయి మూడేళ్లుగా బోర్ల నుంచి చుక్క నీరు కూడా రావడం లేదని, దయచేసి ఇసుకను తరలించొద్దంటూ ప్రాధేయపడుతూ లారీకి అడ్డుగా నిలిచాడు. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుక మాఫియా దౌర్జన్యానికి దిగడమే కాకుండా పోచయ్యను లారీతో ఢీకొట్టి హతమార్చింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఇసుక మాఫియా కారణంగా గ్రామంలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments