Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా విజృంభణ.. 13మంది మృతి

Webdunia
గురువారం, 30 జులై 2020 (09:59 IST)
తెలంగాణలో కరోనా తీవ్రత అధికంగా వుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వైద్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో బుధవారం 1,811 పాజిటివ్ కేసులు నమోదు కాగా..13 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కు చేరింది. అలాగే మొత్తం 505 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 
 
జిల్లాల వారీగా అత్యధికంగా రంగారెడ్డిలో 289, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 151, వరంగల్‌లో 102, నల్లగొండలో 61 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 18,263 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 4,16,202 మంది కరోనా పరీక్షలు జరిపారు.
 
తెలంగాణలో 16 ప్రభుత్వ, 23 ప్రైవేట్ ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్, సీబీ నాట్ కరోనా పరీక్షా కేంద్రాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments