భాగ్యనగరిలో వీధి కుక్కల స్వైర విహారం - 16 మందిపై దాడి

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (11:31 IST)
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు స్వైర వివాహం చేస్తున్నాయి. ఇటీవలే ఈ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు కన్నుమూసిన విషయం తెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని సుమోటాగా కేసు నమోదు చేసింది.
 
ఈ నేపథ్యంలో భాగ్యనగరిలో వీధి కుక్కలు మరోమారు స్వైర వివాహం చేశాయి. హైదరాబాద్ బాలానగర్‌ పరిధి వినాయక్‌నగర్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కుక్క ఎగబడుతూ కరిచింది. 
 
గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి జోన్‌ డాగ్‌ స్వ్కాడ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాదాపు 2 గంటలపాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments