Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ : డోలీలో ఆస్పత్రికి వెళ్లిన గర్భిణీ మహిళ.. 20కిలో మీటర్లు..?

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (22:30 IST)
Doli
మారుమూల గ్రామాల్లోని ప్రజలు సవాళ్లను ఎత్తిచూపుతున్న బాధాకరమైన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గర్భిణిని స్థానికంగా 'డోలీ' ద్వారా ఆస్పత్రికి చేరుకుంది. ఇద్దరు పురుషుల సాయంతో పురిటినొప్పులు వచ్చిన మహిళను డోలీతో ఆస్పత్రికి చేర్చారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం, అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో డోలీతో ఆమెను ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థతి ఏర్పడిందని గ్రామస్థులు వాపోతున్నారు. 
 
విపరీతమైన ప్రసవ వేదనకు గురైన ఆ గిరిజన మహిళ కుటుంబ సాయంతో డోలీ కట్టి ఆస్పత్రికి చేరింది.ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు ఆమెను డోలీ ద్వారా అటవీ ప్రాంతం గుండా తీసుకువెళ్లి సమీప వైద్య సదుపాయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. 
 
దాదాపు 20 కిలోమీటర్ల మేర ఆమెను భుజాలపై ఎక్కించుకుని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మహిళను ఆరోగ్య కేంద్రం నుంచి అంబులెన్స్‌లో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments