Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయటం కోసం తబ్రీద్‌తో తెలంగాణ భాగస్వామ్యం

image
, బుధవారం, 6 సెప్టెంబరు 2023 (19:40 IST)
పారిశ్రామిక, వాణిజ్య పార్కుల కోసం అత్యుత్తమ శ్రేణి శీతలీకరణ మౌలిక సదుపాయాలను ఉత్తమంగా అభివృద్ధి చేసేందుకు, భారతదేశంలోని శీతలీకరణ దృశ్యానికి పునరాకృతినిచ్చేందుకు, కూలింగ్ యుటిలిటీస్‌లో గ్లోబల్ లీడర్ అయిన తబ్రీద్‌తో  తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం చేసుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ (HPC) కోసం ఆసియాలో అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్(PPP) ప్రాజెక్ట్‌తో ప్రారంభించి, తబ్రీద్ 125,000 ఆర్‌టి డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్లాంట్లు, నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయనుంది. పారిశ్రామిక యూనిట్ల ప్రక్రియ శీతలీకరణ, నిల్వ అవసరాల కోసం సేవా నమూనాగా యుటిలిటీ కూలింగ్ ద్వారా శీతలీకరణ సేవలను మరింత పర్యావరణ అనుకూలంగా, దీర్ఘకాల శీతలీకరణ సేవలు అందించడానికి $200 మిలియన్ల వరకు సంస్థ పెట్టుబడి పెట్టనుంది. 
 
మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ సంచలనాత్మక కార్యక్రమం బహుళ-రెట్లు ప్రయోజనాలను అత్యంత విశ్వసనీయమైన పరిష్కారాలు, అత్యుత్తమ వ్యయ-సమర్థత మరియు అపూర్వమైన ఆర్థిక వ్యవస్థల ఏకీకరణ ద్వారా తెస్తుంది. ఈ ఫలితంగా 6,800 GWh విద్యుత్ ఆదా మరియు 41,600 మెగా లీటర్ల నీటి పొదుపు, ప్రాజెక్ట్ జీవితకాలంలో 6.2 మిలియన్ టన్నుల CO2ను ఆదా చేయడం ద్వారా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ మార్గదర్శక ప్రయత్నం ఔషధ పరిశ్రమ యొక్క శీతలీకరణ ప్రక్రియలను విప్లవాత్మకంగా మార్చడానికి నిర్దేశించబడినది, వివిధ బల్క్ డ్రగ్ తయారీ సౌకర్యాల కోసం స్వచ్ఛమైన, పచ్చటి వాతావరణానికి దోహదం చేస్తుంది.
 
ఇప్పటికే ఉన్న, రాబోయే వాణిజ్య జిల్లాలైన సైబరాబాద్, ఇతర మిశ్రమ వినియోగ అభివృద్ధి ప్రాంతాలలో శీతలీకరణ మౌలిక సదుపాయాలను అన్వేషించడానికి తెలంగాణ ప్రభుత్వం తబ్రీద్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. దీని ఫలితంగా 200 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా 30 సంవత్సరాల కాలంలో 18 మిలియన్ టన్నులు CO2 తగ్గుతుంది. ఈ ఫలితంగా హీట్ ఐలాండ్ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా ఆసియాలో నివసించడానికి, పని చేయడానికి అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
 
ఈ మహోన్నత సందర్భంలో తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలు-వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావు (కెటిఆర్) మాట్లాడుతూ, “మరింత సుస్థిర భవిష్యత్తు వైపు మేము ప్రయాణాన్ని ప్రారంభించిన వేళ, తబ్రీద్‌తో భాగస్వామ్యం చేయడం మాకు ఆనందంగా ఉంది. వినూత్నమైన, అమలు చేయగల పరిష్కారాలను స్వీకరించడం ద్వారా పర్యావరణ నిర్వహణ పట్ల తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు ఇది ఉదాహరణగా నిలుస్తుంది. కూల్ రూఫ్ పాలసీలు, ఎనర్జీ-ఎఫిషియెంట్ డిస్ట్రిక్ట్ కూలింగ్ ద్వారా శీతలీకరణకు కీలకమైన చర్యగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, 2047 నాటికి తెలంగాణను నికర-జీరో రాష్ట్రంగా మార్చాలనే మా ప్రతిష్టాత్మక లక్ష్యానికి గణనీయమైన సహకారం అందించడం ద్వారా మా కమ్యూనిటీలకు మేము హరిత, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రూపొందిస్తున్నాము" అని అన్నారు. 
 
తబ్రీద్ ఛైర్మన్ ఖలీద్ అబ్దుల్లా అల్ ఖుబైసీ మాట్లాడుతూ, "తబ్రీద్ మరియు తెలంగాణ ప్రభుత్వం మధ్య భాగస్వామ్యం స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక మహోన్నత ఘట్టాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద నెట్ జీరో ఫార్మాస్యూటికల్ క్లస్టర్‌కు డిస్ట్రిక్ట్ శీతలీకరణలో మా నైపుణ్యాన్ని తీసుకురావడం ద్వారా, మేము పారిశ్రామిక క్లస్టర్ల భవిష్యత్తును రూపొందించడమే కాకుండా, పర్యావరణ బాధ్యతకు శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. శీతలీకరణ కోసం పెద్ద ఎత్తున ఇంధన వినియోగం చేయటం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు కీలకమైన డ్రైవర్‌లలో ఒకటిగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చేపట్టిన ఈ ఉమ్మడి కార్యక్రమం ద్వారా నికర సున్నా ఉద్గారాలను సాధించడంలో తెలంగాణను ముందంజలో ఉంచి భారతదేశ ప్రయాణానికి దోహదపడుతుండటం వల్ల తబ్రీద్ సంతోషంగా వుంది” అని అన్నారు. 
 
తబ్రీద్ ఇండియా కంట్రీ హెడ్ సుధీర్ పెర్ల మాట్లాడుతూ, "భారతదేశంలో ఇంధన పరివర్తన, భద్రత లేదా సుస్థిరత లక్ష్యాలను చేరుకునే ప్రయత్నాలలో బాధ్యతాయుతమైన, అతి తక్కువ ఇంధన వినియోగానికి తోడ్పడే పరిష్కారాల ద్వారా శీతలీకరణ డిమాండ్‌ను తీర్చడం కీలకమైన ప్రాధాన్యతగా ఉద్భవించింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ద్వారా విద్యుత్ మంత్రిత్వ శాఖ డిస్ట్రిక్ట్  శీతలీకరణ మార్గదర్శకాలను ప్రారంభించడం దీనికి నిదర్శనం.  తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ పరివర్తనకు నాయకత్వం వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ అవగాహన ఒప్పందం ద్వారా, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి డిస్ట్రిక్ట్  శీతలీకరణ ప్రయోజనాలను ప్రదర్శించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ ప్రాంతం మరియు పర్యావరణ అనుకూల పట్టణీకరణకు నమూనాగా మారాలనే తెలంగాణ లక్ష్యానికి దోహదం చేస్తుంది..." అని అన్నారు.
 
“సుస్థిర శీతలీకరణ ద్వారా ఇంధన పరివర్తనను అందించడంలో తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వడం పట్ల UNEP గర్వంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన కూల్ రూఫ్ విధానం, తబ్రీద్‌కు డిస్ట్రిక్ట్ శీతలీకరణ కన్సెషన్ అందించటం  మరియు సస్టైనబుల్ కూలింగ్ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం మేము తెలంగాణ రాష్ట్రాన్ని అభినందిస్తున్నాము” అని UNEP, ఇండియా ఆఫీస్ హెడ్, అతుల్ బగై అన్నారు. ఆయనే మాట్లాడుతూ "హైదరాబాద్ ఫార్మా సిటీని ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ కన్సెషన్‌గా మార్చడంలో సస్టెయినబుల్ ఎనర్జీ పరిశ్రమలో రెండు అగ్రగామి సంస్థలు ఒకే దారికి రావడం పట్ల సంతోషిస్తున్నాము" అని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజానా... ఆమె ఎవరు..? ఆమె ఎవరో తనకు తెలియదు.. కంగనా రనౌత్