వీడియో కాల్ చేసి నగ్నంగా మాట్లాడింది.. అతడిని కూడా నగ్నంగా మార్చేసింది..

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (14:47 IST)
యువతి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మొబైల్‌కు వచ్చిన ఓ మెసేజ్ అతడిని ఆకర్షించింది. తాను ఒంటరి మహిళనని, మీతో చాటింగ్ చేయాలనుకుంటున్నానని ఉన్న ఆ మెసేజ్‌కు అతడు వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆ వెంటనే అటునుంచి ఓ యువతి వీడియో కాల్‌చేసి నగ్నంగా మాట్లాడింది. అతడిని కూడా నగ్నంగా మార్చేసింది. 
 
ఆ వీడియో సంభాషణను రికార్డు చేసిన ఆమె డబ్బుల కోసం డిమాండ్ చేసింది. అడిగినంత ఇవ్వకుంటే ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామంటూ ముఠా సభ్యులతో కలిసి యువకుడిని బెదిరించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని యువకుడు తన ఖాతాలో ఉన్న రూ. 24 వేలను వారికి ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయినప్పటికీ వారి నుంచి వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండడంతో నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లాడు.
 
ఆ తర్వాతి రోజు ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments