దిశ తల్లిదండ్రులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పిలుపు

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (07:48 IST)
చటాన్‌పల్లి వద్ద హత్యాచారానికి గురైన ‘దిశ’ తల్లిదండ్రులకు జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నుంచి పిలుపొచ్చింది. వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారిని కోరింది.. కేసు విచారణలో భాగంగా దిశ తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేది..
 
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను రాష్ట్ర పోలీస్‌ అకాడమీకి తీసుకెళ్లేందుకు పోలీసులు శంషాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. దిశ దశదిన కర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె తల్లి ఆరోగ్యం సహకరించడం లేదని ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరారు. మరోవైపు ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీరుకు నిరసనగా దిశ నివాసం వద్ద కాలనీవాసులు ఆందోళకు దిగారు. 

ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి మరోసారి ఎన్‌హెచ్‌ఆర్సీ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ఎన్హెచ్ఆర్సీ బృందం మరోసారి పరిశీలించనుంది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును పోలీసులు వివరించనున్నారు. తొలిరోజు మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రిలో నిందితుల మృతదేహాలు, చటాన్ పల్లి వద్ద ఘటనా స్థలాలను కమిషన్‌ సభ్యులు పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments