Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్ల మార్కెట్‌లోకి వీనస్.. 5 శాతం మార్కెట్‌ లక్ష్యమే దిశగా ప్రణాళికలు

దేశంలో వాటర్ హీటర్ల తయారీలో అగ్రగామిగా ఉన్న ఉత్పత్తి కంపెనీల్లో వీనస్ హోం అప్లయెన్సెస్ ఒకటి. ఈ కంపెనీ తాజాగా ఫ్యాన్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. సీలింగ్, టేబుల్, ఫెడస్టల్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనే నాలుగు వేరియంట్లలో ప్రవేశించింది. భారత్‌లో ఫ్యాన్ మార్క

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (14:11 IST)
దేశంలో వాటర్ హీటర్ల తయారీలో అగ్రగామిగా ఉన్న ఉత్పత్తి కంపెనీల్లో వీనస్ హోం అప్లయెన్సెస్ ఒకటి. ఈ కంపెనీ తాజాగా ఫ్యాన్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. సీలింగ్, టేబుల్, ఫెడస్టల్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనే నాలుగు వేరియంట్లలో ప్రవేశించింది. భారత్‌లో ఫ్యాన్ మార్కెట్ విలువ రూ.6500 కోట్లుగా ఉంది. ఇందులో 5 శాతం మార్కెట్ షేర్ లక్ష్యంగా ఆ కంపెనీ ప్రణాళికలు తయారు చేసి ముందుకు సాగుతోంది. 
 
ఇదే అంశంపై ఆ కంపెనీ ప్రతినిధులు ఐ. రామ్ కుమార్, సయ్యద్ షబ్బీర్ స్పందిస్తూ తమ సంస్థ ఇప్పటికే వాటర్ హీటర్ల తయారీలో అగ్రగామిగా ఉంటూ మంచి బ్రాండ్‌గా గుర్తింపు పొందిందన్నారు. ఇపుడు తమ సంస్థ ఫ్యాన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టినట్టు తెలిపారు. వాటర్ హీటర్ తయారీలో 50 యేళ్ళ ప్రయాణం ఉందని, ఈ అనుభవాన్ని కేంద్రంగా చేసుకుని, దేశంలో ఫ్యాన్ల మార్కెట్‌పై ఒక యేడాదిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ మార్కెట్‌లోకి అడుగుపెట్టినట్టు తెలిపారు. 
 
భారత్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతమన్నారు. ఇక్కడ రూ.6500 కోట్ల విలువ చేసే మార్కెట్ అవకాశం ఉందని, ఇందులో ఐదు శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకునే దిశగా తాము మార్కెట్‌లోకి ప్రవేశించినట్టు వారు తెలిపారు. అదేసమయంలో తమ కంపెనీకి విస్తృతమైన నెట్‌వర్క్ ఉందన్నారు. తమకు దేశ వ్యాప్తంగా 175 సర్వీస్ సెంటర్లు, 4 వేల మంది డీలర్లు ఉన్నారని వివహించారు. ప్రస్తుతం తాము ప్రవేశపెట్టిన ఫ్యాన్లు ఈ నెల నాలుగో తేదీ నుంచి దేశంలోని అన్ని రీటైల్ ఔట్‌లెట్లలో లభ్యమవుతాయని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments