Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో భారీగా పెట్టుబడులు: రూ.1000 కోట్లతో కోకాకోలా కంపెనీ

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (09:17 IST)
ktr
తెలంగాణలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో తాజాగా హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌ (హెచ్‌సీసీబీ) సంస్థ రూ.1000 కోట్లతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
 
సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్క్‌లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పనుంది ఈ సంస్థ. మొదటి విడుతలో భాగంగా రూ.600 కోట్లను రానున్న రెండేళ్లలో ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఈ మేరకు గురువారం తాజ్ కృష్ణ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో హెచ్‌సీసీబీ రెండో యూనిట్‌ ప్రారంభించనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నూతన ఫ్యాక్టరీతో 300 మంది నిరుద్యోగులకు నేరుగా ఉపాధి లభించనుందని వివరించారు.  

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments