శోభనం జరగలేదని తల్లిదండ్రులతో చెప్తావా? వధువు ఏం చేసిందంటే?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (13:30 IST)
తల్లిదండ్రుల ముందు.. మీ కుమార్తెతో శోభనం జరగలేదని అల్లుడు చెప్పడంతో పాటు.. ఆమె శోభనానికి నిరాకరించిందని.. దానికి కారణం ఏంటో అడిగి తెలుసుకోమని కొత్త పెళ్లి కొడుకు వధువు తల్లిదండ్రులను కోరడంతో నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇలా పెళ్లి పారాణి కూడా ఆరక ముందే వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం, బొట్టు చెరువు గ్రామనికి చెందిన స్వామి ప్రగతి నగర్ లో నివసిస్తున్నారు. స్వామి తన పెద్ద కుమార్తె సౌజన్యకు, ఏపీలోని తమ స్వగ్రామంలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న వేంకటేశ్వర రావుకి ఇచ్చి ఈ నెల 6వ తేదీన వివాహం జరిపించారు.
 
వివాహం అనంతరం శోభనం కోసం 9వ తేదీన ఏర్పాట్లు చేశారు. కానీ 10వ తేదీ ఉదయం, సౌజన్య భర్త వేంకటేశ్వర రావు, తమకు శోభనం జరగలేదని, ఆమె నిరకారించింది అని అలా ఎందుకు నిరాకరించిందో కారణం తెలుసుకోవాలని సౌజన్య తల్లిదండ్రులను కోరాడు. తమ మధ్య ఉండాల్సిన విషయం తల్లితండ్రుల ముందు చెప్పడంతో మనస్తాపానికి గురైన సౌజన్య, గదిలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరివేసుకుంది. 
 
సౌజన్య తలుపు తీయకపోవటంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్ళిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సౌజన్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments