Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ కేసు దర్యాప్తులో కొత్త కోణాలు

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (08:25 IST)
దిశ కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. దిశ హత్యాచార నిందితుల నేరాల చిట్టా తెలిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితుల వాంగ్మూలంలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

దిశ హత్యకు ముందుకు మరో 9మంది మహిళలపై హత్యాచారం జరిపినట్టుగా వాంగ్మూలంలో నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రధాన సూత్రధారి ఆరిఫ్‌ అలీ 6 హత్యలు.. చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్లు అంగీకరించారని తెలుస్తోంది.

ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్నాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని సమాచారం. ప్రతి ఘటనలోనూ మహిళలపై అత్యాచారం, హత్య చేసి.. మృతదేహాలను దహనం చేసినట్టు పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
దిశ కేసు నిందితుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్లు చెప్పిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు మొత్తం 15 సంఘటనలు జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాటన్నింటికి సంబంధించిన డీఎన్‌ఏ నివేదికలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

అయితే చాలా వాటిల్లో మృతదేహలు పూర్తిగా కాలిపోవడంతో.. డీఎన్‌ఏ పరీక్షల్లో సరైన ఫలితాలు రాలేదని సమాచారం. దీంతో శాస్త్రీయ పద్ధతుల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దిశ కేసు నిందితుల డీఎన్‌ఏను.. 15 మంది మృతుల డీఎన్‌ఏలతో విశ్లేషిస్తున్నారు. దిశ కేసు చార్జిషీట్‌లో నిందితుల నేరాల చిట్టా పొందుపర్చే అవకాశం ఉంది.
 
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని కోర్టు షరతు విధించింది.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ రిక్వెస్ట్ మేరకు.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నలుగురు నిపుణులతో కూడిన టీమ్ ను హైదరాబాద్ పంపేందుకు అంగీకరించింది.
 
 ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలోని టీమ్ లో డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్, డాక్టర్ వరుణ చంద్ర టీమ్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా సోమవారం ఉదయం 9 గంటలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో రీపోస్టుమార్టం ప్రారంభిస్తారు. ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీసి, కలెక్షన్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్రపరుస్తారు.
 
సోమవారమే నలుగురి అత్యక్రియలు!
రీపోస్టుమార్టం పూర్తయిన వెంటనే నలుగురు నిందితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని హైకోర్టు చెప్పింది. సోమవారం ఉదయమే రీపోస్టుమార్టం ప్రక్రియ మొదలుకానుంది. సాయంత్రంలోగా బాడీలను బంధువులకు అప్పగించడంతోపాటు సోమవారమే అంత్యక్రియలు జరిపించేలా ఆయా కుటుంబాలను పోలీసులు ఒప్పించినట్లు తెలుస్తున్నది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments