కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహిస్తామని దక్షిణ మధ్య రైల్యే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. లోకో పైలెట్‌ను రక్షించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయన్నారు.
కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నామని రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని.. ఒకే సమయంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఎంఎంటీఎస్ లోక్ పైలెట్ సిగ్నల్ ఇవ్వకుండా ఎందుకు రైలును ముందుకు తీసుకున్నాడో దర్యాప్తులో తేలుతుందన్నారు. లోకో పైలట్ చంద్రశేఖర్‌తోపాటు మరో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని సీపీఆర్వో తెలిపారు.
బాధితుల వివరాల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-040-27700868, కాచిగూడలో 040-27568624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.
ప్రమాదం వల్ల సికింద్రాబాద్- ఫలక్‌నుమా, కాచిగూడ-ఫలక్‌నుమాకు వెళ్లాల్సిన ఎంఎంటీఎస్ రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్లు వెల్లడించారు. వీటితోపాటు ఫలక్‌నుమా- జనగాం, సికింద్రాబాద్ -కర్నూల్ సిటీ, ఫలక్‌నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి రైళ్లను రద్దు చేశామని వివరించారు.
కాచిగూడ-గుంటూరు, ఫలక్‌నుమా -ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.