Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు
, సోమవారం, 11 నవంబరు 2019 (20:47 IST)
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రాజుకుని లక్షల ఎకరాల అడవి బూడిదవుతోంది. ఇప్పటికే 150 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యేసరికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. 
 
కార్చిచ్చుకు భారత రుతుపవనాల ఆలస్య తిరోగమనం కూడా ఓ కారణమే అంటున్నారు వాతావరణ నిపుణులు.  కార్చిచ్చు కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. వేలాది మంది నివాసం కోల్పోయారు. 
 
దావానలం వేగంగా జనావాసాల వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో సిడ్నీ, ఉత్తరాన ఉన్న హంటర్ వ్యాలీ ప్రాంతాల్లో మంగళవారం అత్యవసర స్థితి కొనసాగుతుందని ప్రకటించింది ప్రభుత్వం. మిగిలిన రాష్ట్రాలలోనూ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.
 
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఎన్నడూలేనంత స్థాయిలో విజృంభించడానికి భారత్​లోని వాతావరణ పరిస్థితులే కారణం అంటున్నారు నిపుణులు. 
 
"భారత దేశంలో గత నెల నుంచి రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు ఇంకా తగ్గడంలేదు. సాధారణంగా ఆసియాలో జూన్​, సెప్టెంబర్​లో రుతుపవనాలు తిరోగమనం చెంది దక్షిణానికి మళ్లుతాయి. 
 
కానీ ఈసారి అలా జరగలేదు. అందుకే ఆస్ట్రేలియాలో వర్షాలు పడక వాతవరణం పొడిబారిపోయింది. ఇది మంటలు చెలరేగేందుకు సరైన స్థితి" ట్రెంట్​ పెన్హామ్​ వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీపుర్లు మోసిన ఎమ్మెల్యే