అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన నాయిని, పరామర్శించిన మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (22:23 IST)
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
 
మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను కోరారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం అవసరం అయినా వెనుకాడవద్దని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. గ‌త నెలలో నాయిని నర్సింహారెడ్డి క‌రోనావైర‌స్ బారిన పడటంతో ఆస్ప‌త్రిలో చికిత్స‌ పొంది కోలుకున్నారు.
 
ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు కుటుంబ‌స‌భ్యులు. ఈ క్రమంలోనే నాయినికి ఇటీవ‌ల‌ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిజన్‌ పడిపోవడంతో అపోలో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments