Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేదెపై ఎక్కి ఎన్నికల ప్రచారం చేసిన అభ్యర్థి, జంతు క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (21:19 IST)
బీహార్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఓ గేదెపై ఎక్కి వీధుల్లో తిరుగుతూ ఓ అభ్యర్థి ప్రచారం చేశాడు. ఇలా ప్రచారం చేస్తున్న అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గయా పట్టణంలో రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి తన ప్రచార పర్వంలో భాగంగా గేదెపై తిరిగారు.
 
గేదెపై ఎక్కిన అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ పైన జంతు క్రూరత్వ నిరోధక చట్టం, కోవిడ్ 19 మార్గదర్శకాల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. అభ్యర్థి పర్వేజ్ గాంధీ మైదానం నుంచి స్వరాజ్‌పూర్ రోడ్డుకు చేరిన వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పర్వేజ్ పైన ఐపీసీ సెక్షన్ 269, 270 కింద పోలీసులు కేసు నమోద చేశారు.
 
తనను గయా అసెంబ్లీ ఎన్నికలో గెలిపిస్తే పట్టణాన్ని కాలుష్యరహితంగా మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి జంతువులను ఉపయోగించరాదని ఎన్నికల కమిషన్ సూచించిందనీ, దీన్ని ఉల్లంఘించిన పర్వేజ్ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments