భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చేనెల 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా అనుభవం ఆధారంగా, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నది.
మొత్తం 92 పోస్టులకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ)-28 పోస్టులు, మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్)-5, డాటా ట్రెయినర్-1, డాటా ట్రాన్స్‌లేటర్-1, సీనియర్ కన్సల్టంట్ అనలిస్ట్-1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజ్, టెక్నాలజీ ఆర్కిటెక్చర్)-1, డాటా ప్రొటెక్షన్ ఆఫీసర్-1, డిప్యూటీ మేనేజర్ (డాటా సైంటిస్ట్)-11. మేనేజర్ (డాటా సైంటిస్ట్)11, డెప్యూటీ మేనేజర్ (సిస్టమ్ ఆఫీసర్)-5, రిస్క్ స్పెషలిస్ట్- 19, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్- 3, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్-5
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. వయస్సు 25 నుంచి 55 ఏండ్లలోపు ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 18
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 8