Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయిని కుటుంబంలో మరో విషాదం.. సతీమణి కూడా కన్నుమూత

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (08:52 IST)
అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి సతీమణి అహల్య కూడా కన్నుమూసింది. ఆమె వయసు 68 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... ఇటీవల కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ నుంచి ఆమె ఇటీవలే కోలుకున్నట్టు కనిపించారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కూడా కరోనా నెగెటివ్ అని వచ్చింది. 
 
అయితే, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. హైదరాబాదు, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నాయిని మృతి సమయంలో ఆఖరి చూపు చూసేందుకు కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్సులో తీసుకెళ్లారు. భర్త చనిపోయిన ఐదు రోజుల్లోనే భార్యాభర్తలు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో నాయిని కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments