Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించేవాళ్లకు అది వుండాలిగా..? భజ్జీ భార్య ఫైర్

Advertiesment
క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించేవాళ్లకు అది వుండాలిగా..? భజ్జీ భార్య ఫైర్
, బుధవారం, 21 అక్టోబరు 2020 (19:24 IST)
Harbhajan Singh_Geeta Basra
గీతా బస్రా భర్త అయిన హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. సురేష్ రైనాతో పాటు హర్భజన్ సింగ్ కూడా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దూరమయ్యాడు. కాగా, 2008లో ఐపీఎల్ ఆరంభ సీజన్‌ నుంచి ఆడుతున్న హర్భజన్ సింగ్ ఈ సారి మాత్రమే ఆడడం లేదు. టర్బనేటర్ భజ్జీ ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌లు ఆడాడు. 7.05 ఎకనామీతో 150 వికెట్లు సాధించాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో 829 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది.
 
ఇటీవల హర్భజన్ సింగ్‌ను ధోనీ ఫ్యాన్స్ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఓ మ్యాచ్‌లో అంపైర్‌ని తన సైగలతో ప్రభావితం చేసి.. వైడ్ ఇవ్వకుండా ఆపాడని చాలా మంది నెటిజన్లు ధోనీని విమర్శించారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. హర్భజన్ నవ్వుతున్న ఎమోజీని పెట్టాడు. ఆ ట్వీట్ ధోనీ అభిమానులకు నచ్చలేదు. సొంత టీమ్‌కు సపోర్ట్ చేయకుండా.. ధోనీపై సెటైర్లు వేస్తావా అంటూ సీఎస్‌కే ఫ్యాన్స్ మండిపడ్డారు. 
 
భజ్జీ పాము లాంటోడదని జట్టు నుంచి వెళ్లిపోయి మంచి పని చేశాడని విమర్శలు గుప్పించారు. ఆ ట్రోలింగ్‌పై హర్భజన్ కూడా ఘాటుగా స్పందిచాడు. పందులతో కుస్తీ పడితే మనకే బురద అంటుకుంటుందని ట్వీట్ చేసి.. ఎదురు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌ల గెలుపోటములకు క్రికెటర్ల భార్యలను, కుటుంబీకులను బాధ్యుల చేసే అభిమానులపై హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే అభిమానులకు క్షమాగుణం ఉండాలని చెప్పింది. అంతేకానీ వేరొకరిని బలిపశువు చేయకూడదు. చాలా మంది అభిమానులు క్రికెటర్ల భార్యలు, గర్ల ఫ్రెండ్స్‌ని చాలా ఈజీగా టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టింది. ఇలాంటి వారివల్లే క్రికెటర్ల ఆట పాడవుతోందని విమర్శిస్తున్నారు. బాగా ఆడినప్పుడు మెచ్చుకోని వారు.. వైఫల్యం చెందినప్పుడు మాత్రం వారి భార్యలను ఎందుకు బాధ్యులను చేస్తారని ప్రశ్నించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ చరిత్రలో తొలి కరోనా వైరస్ సబ్‌స్టిట్యూట్ ఎవరో తెలుసా?