Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో నేషనల్ పేమెంట్ డేటా సెంటర్

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (19:36 IST)
హైదరాబాదు నగరంలో స్మార్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. వివాదాల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పేమెంట్ యాఫ్స్ కార్డులు ఇతరత్రా నగదు రహిత లావాదేవీలను నిర్వహించడం వంటివి ఇది చేస్తుంది.
 
ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ. 500 కోట్ల  పెట్టుబడితో ఎన్‌పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్‌కు రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. ఎన్‌పీసీఐ ఈ డేటా సెంటర్‌ను అంతర్జాతీయస్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తోంది.
 
ఈ డేటా సెంటర్‌ను నిర్మించేందుకు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. భూకంపం, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలకు చెక్కుచెదరకుండా ఉండేటట్లు అత్యంత పటిష్టంగా నిర్మించనున్నారు. ఇది పూర్తయితే దేశంలో అతి పెద్ద డిజిటల్ ఆన్ లైన్ నిర్వహణ కేంద్రంగా హైదరాబాదు మారనున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments