Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులపై దాడి.. చంచల్‌గూడ జైలుకు వైఎస్ షర్మిల.. 14 రోజుల రిమాండ్

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (22:36 IST)
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం పోలీసులపై చేయి చేసుకున్న ఘటనలో ఆమెపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను నాంపల్లి కోర్టుకు తరలించారు. మరోవైపు, షర్మిళ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు కూడా పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వు చేసింది. 
 
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దర్యాప్తుపై సిట్ అధికారికి వినతి పత్రం ఇవ్వాలని షర్మిళ నిర్ణయించుకున్నారు. లోటస్ పాండ్‌లోని తన ఇంటి నుంచి ఆమె సోమవారం మధ్యాహ్నం సిట్ ఆఫీసుకు బయలుదేరారు. ఈ క్రమంలో బంజారా హిల్స్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్న పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత షర్మిళను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
అదేసమయంలో షర్మిళ వ్యవహారశైలిపై పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా షర్మిళ, ఏ2గా డ్రైవర్ బాబు, ఏ3గా యాకబ్‌లను పోలీసులు చేర్చారు. అయితే, షర్మిళ, బాబులను పోలీసులు అరెస్టు చేయగా, యాకబ్ మాత్రం పరారీలో ఉన్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments