Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీస్ చెంప ఛెళ్లుమనిపించిన వైఎస్ విజయమ్మ.. ఎందుకు?

ysvijayamma
, సోమవారం, 24 ఏప్రియల్ 2023 (16:39 IST)
విధుల్లో ఉన్న పోలీసులపై దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళలు చేయి చేసుకున్నారు. తనను అడ్డుకున్న పోలీస్‌ చెంప ఛెళ్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వైకాపా అధ్యక్షురాలు షర్మిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను చూసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోలీసులను కొట్టలేదన్నారు. చేయి అలా అన్నానంతే అని చెప్పారు. పోలీసులు మీద పడుతుంటే కోపం రాదా అని ఆమె ప్రశ్నించారు. నిజంగానే పోలీస్‌ను కొట్టాలని అనుకుంటే గట్టిగానే కొట్టేదాన్నని ఆమె వ్యాఖ్యానించారు. 
 
తన కుమార్తె షర్మిళ సిట్ కార్యాలయానికి వెళితే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నందుకే వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. షర్మిళ వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిళ ఎక్కడికీ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. షర్మిల డ్రైవర్‌పై కూడా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెంలగాణాలో వైఎస్ఆర్ ఆశయ సాధన కోసమే తమ కుమార్తె తెలంగాణాలో పార్టీ పెట్టిందని ఆమె గుర్తుచేశారు. 
 
అయితే, తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులను కొట్టానంటా టీవీ చానళ్ళలో చూపిస్తున్నారని విజయమ్మ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తనపై పడుతుంటే కోపం రాదా అని ప్రశ్నించారు. తాను నిజంగా కొట్టాలంటే గట్టిగా కొట్టేదాన్నని అన్నారు. తాను పోలీసును కొట్టలేదని, చేత్తో అలా అన్నానంతేనని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు తెలుపాల్సిన బాధ్యత మీడినయాకు ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ అవినాష్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. అరెస్టుకు లైన్ క్లియర్!