Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎట్టకేలకు ఖలిస్థానీ నేత అమృతపాల్ సింగ్ అరెస్ట్

Advertiesment
amruthapal singh
, ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (09:31 IST)
గత నెల రోజులుగా పంజాబ్ పోలీసులకు చుక్కలు చూపిస్తూ వచ్చిన ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థ వారిస్ పంజాబ్ డే నేత అమృతపాల్ సింగ్ ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. పంజాబ్ రాష్ట్రంలోని మెగాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అస్సాం రాష్ట్రంలోని డిబ్రూఘర్ జిల్లాకు తరలించారు. 
 
గత మార్చి 18వ తేదీ నుంచి పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్‌ను ఆదివారం తెల్లవారుజామున పంజాబ్‌ మెగాలోని రోడే గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అస్సాంలోని జైలుకు తరలించారు. ఆయన సంస్థకు చెందిర ఇతర నేతలు కూడా అదే జైలులో ఉండటంతో అమృతపాల్‌ను అక్కడకు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
అమృతపాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసులు జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు. పంజాబ్ పోలీసులు, జాతీయ నిఘా విభాగం అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అమృతపాల్ సింగ్‌ ఆచూకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
నిజానికి తన సన్నిహేతుడు లవ్ ప్రీత్ సింగ్ అలియాస్ తుఫాన్ సింగ్‌ను ఒక కిడ్నాప్ కేసులో పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విడిపించుకునేందుకు అమృతపాల్ పిలుపు మేరకు గత ఫిబ్రవరి నెల 23వ తేదీన అమృతసర్‌లోని అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది. దీంతో యువతను రెచ్చగొట్టారంటూ అమృతపాల్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత అతడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. 
 
అయితే, ఎప్పటికపుడు మారు వేషాలు వేస్తూ పోలీసులకు చిక్కకుండా గత నెల రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో అమృతపాల్ పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి, లుకౌట్ నోటీసు, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన్ను అరెస్టు చేశారు. అదేవిధంగా రెండు మూడు రోజుల క్రితం ఆయన భార్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె లండన్‌కి పారిపోతుండగా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజీవ్ గాంధీ తరహాలోనే ప్రధానిపై దాడి చేస్తాం.. కేరళలో హెచ్చరిక